Sat Dec 27 2025 09:46:29 GMT+0000 (Coordinated Universal Time)
Jaleel khan : బెజవాడ రాజకీయాల్లో ఇక కష్టమేనా .. ఖాన్ భయ్యా?
విజయవాడ రాజకీయాల్లో జలీల్ ఖాన్ పేరు ఇక వినిపించడం కష్టమేమో

విజయవాడ రాజకీయాల్లో జలీల్ ఖాన్ పేరు ఇక వినిపించడం కష్టమేమో. ఆయన రాజకీయంగా చేసిన తప్పుటడుగులు ఆయన పొలిటికల్ కెరీర్ ను పూర్తిగా మార్చేశాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన జలీల్ ఖాన్ తర్వాత వరసగా పార్టీలు మారుస్తూ తన కున్న పరపతిని పూర్తిగా కోల్పోయారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు. అంటే ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టిక్కెట్ ఇవ్వగా, మరొకసారి ఆయన కుమారుడు జగన్ టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా...
గెలిచిన రెండుసార్లు ఆయన తనకు టిక్కెట్ ఇచ్చిన పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శించారురు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటంతో కాంగ్రెస్, వైసీపీల నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. మరొకవైపు సామాజికవర్గం కూడా ఆయనకు కలసి వచ్చింది. అయినా 2014లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ సొంత ప్రయోజనాల కోసం టీడీపీ చెంత చేరారు. ఆ నిర్ణయమే ఆయన పొలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లయింది. అదే చివరి ఎన్నిక అయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ జలీల్ ఖాన్ కుమార్తెకు సీటు దక్కినా ఫలితం కనిపించలేదు. వైసీపీలో కొనసాగి ఉంటే మైనారిటీ కోటా కింద ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో జలీల్ ఖాన్ మంత్రి అయి ఉండేవారంటున్నారు.
ఏపదవి లేకుండానే...
2019 నుంచి ఇప్పటి వరకూ జలీల్ ఖాన్ కు ఏ పదవి దక్కలేదు. ఇక 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. అక్కడ బలమైన అభ్యర్థి, సుజనా చౌదరి బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా జలీల్ ఖాన్ కు ఏ పదవి దక్కలేదు. గతంలో ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి ఇచ్చినా ఇప్పుడు ఆ పదవి కూడా లభించలేదు. భవిష్యత్ లోనూ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నేతలు సీనియర్లుండటం కూడా ఆయనకు కలసి రాలేదంటున్నారు. దీంతో జలీల్ భాయ్ చేసిన ఒకసారి వేసిన రాంగ్ స్టెప్ ఇక రాజకీయంగా కోలుకోకుండా చేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దాదాపు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు జలీల్ ఖాన్ పేరును మర్చిపోయినట్లే కనపడుతుంది.
Next Story

