Thu Dec 05 2024 16:26:09 GMT+0000 (Coordinated Universal Time)
'జగనన్న తోడు' కార్యక్రమం వాయిదా
ఫిబ్రవరి 22, మంగళవారం నిర్వహించాల్సిన జగనన్న తోడు కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో..
ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖల మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఫిబ్రవరి 22, మంగళవారం నిర్వహించాల్సిన జగనన్న తోడు కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28, సోమవారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే.. మేకపాటి గౌతమ్ మృతికి సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలను ప్రకటించిందని తెలిపారు. మంత్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించ తలపెట్టిన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
News Summary - Jagananna Thodu Programme Postponed due to AP Minister Gautam Reddy Suddent Death
Next Story