Tue Jan 27 2026 07:28:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగనన్న తోడు నిధుల విడుదల
చిరు వ్యాపారులకు వడ్డీలేకుండా పది వేల రూపాయల రుణాన్ని అందించే పథకానికి సంబంధించి నిధులను జగన్ జమ చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ లో నేడు జగనన్న తోడు నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. చిరు వ్యాపారులకు వడ్డీలేకుండా పది వేల రూపాయల రుణాన్ని అందించే పథకానికి సంబంధించి నిధులను జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ బటన్ నొక్కి వారి బ్యాంకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి ఈ పథకం కింద నిధులను అందించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
3.95 మందికి....
ఈ పథకం ద్వారా 3.95 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 395 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలను అందించనుంది. దీంతో పాటు గగత ఆరు నెలలకు సంబంధించిన వడ్డీ రీఎంబర్స్మెంట్ 15.96 కోట్లను కూడా చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇప్పటి వరకూ సకాలంలో తీసున్న రుణాలు చెల్లించిన వారికి 48.48 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Next Story

