Mon Mar 30 2026 15:30:44 GMT+0530 (India Standard Time)
మూలపేట పోర్టుకు శంకుస్థాపన
శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతుంది. మూలపేట గ్రీన్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతుంది. మూలపేట గ్రీన్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం పోర్టు నిర్వాసితుల కాలనీకి కూడా జగన్ శంకుస్థాపన పూర్తి చేశారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివిధ పనులకు...
ఉదయం పది గంటలకు శ్రీకాకుళం జిల్లాకు చేరుకుని వరసగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీదిరి అప్పులరాజు, ధర్మానప్రసాదరావు, గుడవాడ అమరనాథ్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పాల్గొన్నారు. కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Next Story

