Sat Mar 07 2026 19:36:44 GMT+0530 (India Standard Time)
జిల్లా నుంచి ఒకే ఒక్కడు
గౌడ సామజికవర్గానికి చెందిన జోగి రమేష్ కు జగన్ తాజాగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు.

రాష్ట్ర రాజధాని ప్రాంతంలో అనేక సామాజికవర్గాలున్నాయి. ఇక్కడ ఎందరో మంత్రి పదవులకు పోటీ పడ్డారు. కానీ ఈయనకు సామాజికవర్గం సమీకరణమే వరంగా మారింది. గౌడ సామజికవర్గానికి చెందిన జోగి రమేష్ కు జగన్ తాజాగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అతిపెద్దదైనా కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ కు ఒక్కరికే మంత్రి పదవి అవకాశం దక్కింది. నారాయణ స్వామికి ఇవ్వకూడదనుకుంటే జోగి రమేష్ కు ఎక్సైజ్ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఇంటి నివాసం ముట్టడికి కూడా జోగి రమేష్ వెళ్లారు. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయిందని అనేవారు కూడా లేకపోలేదు.
Next Story

