Sat Mar 07 2026 17:42:29 GMT+0530 (India Standard Time)
Appsc : నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్
ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది

ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబరు 21 నుంచి జవవరి 20వరకూ దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించింది.
మొత్తం పోస్టులు...
ఇందులో మొత్తం 897 పోస్టులను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఇందులో 331 పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, 566 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా నిర్ణయించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగులకు ఈ శుభవార్త అందడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
Next Story

