Sat Mar 07 2026 23:02:14 GMT+0530 (India Standard Time)
వీఆర్ఎస్ తీసుకున్న మాజీ సీఎస్ సోమేష్ కుమార్
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసేందుకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసేందుకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు సోమేష్ కుమార్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్లారు. అక్కడ జాయినింగ్ రిపోర్టు కూడా ఇచ్చారు.
ప్రభుత్వం ఆమోదం...
అయితే తాను వీఆర్ఎస్ తీసుకుంటానని జగన్ ప్రభుత్వానికి చెప్పడంతో అందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అందుకే కొన్నాళ్ల నుంచి సోమేష్ కుమార్ కు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా అందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నట్లయింది.
Next Story

