Sat Mar 07 2026 12:03:14 GMT+0530 (India Standard Time)
Vijayawada : బెజవాడలో మళ్లీ వర్షం..ఎన్నాళ్లిలా?
విజయవాడలో మళ్లీ వర్షం మొదలయింది. ప్రజల్లో భయం పట్టుకుంది. వర్షం పడుతుండటంతో సింగ్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు

విజయవాడలో మళ్లీ వర్షం మొదలయింది. దీంతో ప్రజల్లో భయం పట్టుకుంది. అర్థరాత్రి నుంచి విజయవాడలో వర్షం పడుతుండటంతో సింగ్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఐదు రోజుల నుంచి విద్యుత్తు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరోసారి వర్షం కురుస్తుండటంతో చిగురాటుకుల్లా వణికిపోతున్నారు.
సహాయక చర్యలకు...
ఒకవైపు వరద తగ్గడంతో ఇక పరవాలేదు అనుకునే సమయంలో మళ్లీ వర్షం మొదలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఆహారం, మంచినీరు వంటివి అందుతున్నప్పటికీ ఎన్నాళ్లు ఇలా వరదల్లో ఉండాల్సి వస్తుందన్న ప్రశ్న వారిని వెంటాడుతుంది. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది.
Next Story

