Mon Oct 07 2024 13:32:49 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : 24 నుంచి యువగళం పాదయాత్ర
టీడీపీ నేత నారా లోకేష్ ఈ నెల 24వ తేదీ నుంచి తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 24వ తేదీ నుంచి తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఈ యువగళం పాదయాత్రను విశాఖపట్నంలో ముగించాలని పార్టీ వర్గాలు నిర్ణయించారు. తొలుత కుప్పం నుంచి ఇచ్ఛాపురం నియోజకవర్గం వరకూ యువగళం పాదయాత్ర చేయాలనుకున్నా మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. గత సెప్టంబరు 8వ తేదీన రాజోలు చేరుకున్న యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు.
విశాఖలో ముగింపు...
దీంతో గత దాదాపు రెండున్నర నెలల నుంచి యువగళం పాదయాత్ర జరగడం లేదు. అయితే చంద్రబాబుకు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులోఅరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ టు రాజమండ్రి తిరుగుతూ న్యాయవాదులతో చర్చలు జరపడానికే సమయం వెచ్చించారు. అయితే ఈ నెల 24వ తేదీ నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించి విశాఖ లో ముగించాలని నిర్ణయించారు. గతంలో చంద్రబాబు కూడా మీకోసం పాదయాత్రను విశాఖలో ముగించడం సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో పాదయాత్రను కుదించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Next Story