Mon Jun 16 2025 12:45:54 GMT+0000 (Coordinated Universal Time)
ఐటీలో రీఫండ్ కుంభకోణం.. తెలుగు రాష్ట్రాల్లో సోదాలు
హైదరాబాద్ లో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి..

ఆదాయపు పన్ను శాఖలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఐటీశాఖ నుంచి పలువురు రీఫండ్ పొందినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ స్కాంలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరించారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ లో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ట్యాక్స్ రీఫండ్ పేరుతో ఏకంగా రూ.40 కోట్లు స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారులు అంతకన్నా ఎక్కువ మొత్తంలోనే నిధులు స్వాహా చేశారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోదాలు పూర్తయితే గానీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత మేర కుంభకోణం చేశారో తెలుస్తుంది.
Next Story