Fri Jan 30 2026 10:13:21 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భారీ వర్షం.. భక్తుల ఇబ్బందులు
తిరుమలలో ఈరోజు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురియడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు

తిరుమలలో ఈరోజు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురియడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. తిరుమలలోని అన్ని రహదారులు నీటితో నిండిపోయాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం మాడవీధుల్లో స్వామి వారి సేవలను వీక్షించేందుకు ఎక్కువ మంది వచ్చారు. అయితే వర్షం పడటంతో భక్తులు తడిసిముద్దయ్యారు.
తడిసి ముద్దయిన...
దర్శనానికి వెళ్లిన భక్తులు మాత్రం కొంతలో కొంత వర్షం బారిన నుంచి కాపాడుకోగలిగారు. అప్పుడే దర్శనం పూర్తయిన భక్తులు మాత్రం తిరిగి తమ క్యాటేజీకి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. బయట వర్షం నుంచి తలదాచుకోవడానికి షెడ్లు కూడా నిండిపోవడంతో భక్తులు వర్షంలోనే తడుస్తూ తమ వసతి గృహాలకు తరలి వెళ్లడం కనిపించింది. సాయంత్రానికి వర్షం తగ్గి మాడవీధుల్లో స్వామి వారిని వీక్షించేందుకు వీలు కలిగేలా వాతావరణం సహకరించాలని కోరుకుంటున్నారు.
Next Story

