Tue Dec 30 2025 07:14:16 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ మీటింగ్ పై బాబు రెస్పాన్స్ ఇదే
ఫిలిం ఇండ్రస్ట్రీలో సమస్యలు సృష్టించి దాని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు

ఫిలిం ఇండ్రస్ట్రీలో సమస్యలు సృష్టించి దాని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్నటి టాలీవుడ్ మీటింగ్ ను చూసి తనకు ఆశ్చర్యం వేసిందని చంద్రబాబు అన్నారు. ఇలాగా కూడా చేయవచ్చా? అని తనకే అర్థం కాకుండా ఉందన్నారు. లేేని సమస్యలను టాలీవుడ్ లో సృష్టించి చర్చల పేరిట తన వద్దకు పిలిపించుకుని పరిష్కారం చేస్తామని చెప్పడం చూసి ఏం చేయాలో నాకు తెలియదన్నారు.
లేనిపోని సమస్యలు సృష్టించి....
తాను తొలిసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశానని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఏరోజూ ఫిలిం ఇండ్రస్ట్రీ జోలికి వెళ్లలేదన్నారు. వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారని, అటువంటి వారిపై కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగుతున్నారన్నారు. ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 2019 లో జీవన ప్రమాణాలేంటి? ఈ రోజు ఎంత? అన్నది ఆలోచించుకోవాలని చంద్రబాబు కోరారు. వైసీపీ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదన్నారు.
Next Story

