Fri Dec 05 2025 23:16:23 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ఉద్యమానికి నేటికి ఏడాది
శాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేయవద్దంటూ కార్మికులు ఆందోళన చేపట్టి నేటికి ఏడాది అయింది

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేయవద్దంటూ కార్మికులు ఆందోళన చేపట్టి నేటికి ఏడాది అయింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు వడివడిగా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. దీనిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి రోజూ ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు నేటికి ఏడాది పూర్తి కావడంతో 365 జెండాలతో నిరసన తెలపాలని నిర్ణయించారు.
అన్ని పార్టీలూ మద్దతిచ్చినా....
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ కొనసాగుతున్న ఉద్యమానికి ఏపీలోని అధికార వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైసీపీ ఏకంగా పాదయాత్ర చేసింది. టీడీపీ నేత ఆమరణ దీక్షకు దిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకరోజు ధర్నాలో పాల్గొన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్ణయించారు.
Next Story

