Fri Dec 05 2025 18:59:05 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబూ దొంగ ఏడుపులు మానుకో
వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేశ్ తో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించింది టీడీపీ కాదా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు

వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేశ్ చౌదరితో ఎలక్షన్ కమిషన్కు కంప్లెయింట్ చేయించింది టీడీపీ కాదా? అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చేసిందంతా చేసి మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. వలంటీర్ల పేరు చెబితేనే ఆయనకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు.
అంతా తానే చేసి....
ఐదు కోట్ల మంది ప్రజలు తిరస్కరించారు కాబట్టి వాళ్ల మీద కూడా పగ పెంచుకున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులను ఎర్రని ఎండలో ఇళ్ల బయటకు నెట్టి శాడిస్టిక్ ఆనందం పొందుతున్నావు కదా బాబూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వాళ్ల ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఈ మూడు నెలలు పెన్షన్లు అందకపోతే చచ్చిపోతారా అంటున్నారని, ఇదే ఆఖరి ఎన్నిక అని అర్థమైందని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story

