Fri Dec 05 2025 22:54:13 GMT+0000 (Coordinated Universal Time)
బాబూ అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం
పోలవరంపై చర్చించేందుకు ఒకరోజు అసెంబ్లీకి రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును కోరారు

పోలవరంపై చర్చించేందుకు ఒకరోజు అసెంబ్లీకి రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కోరారు. శాసనసభకు వస్తే టీడీపీపై చేస్తున్న సవాళ్లపై చర్చిద్దామని ఆయన అన్నారు. డయాఫ్రం వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో ప్రజలకు శాసనసభ సాక్షిగా తెలియజేయాలని అంబటి రాంబాబు అన్నారు. శాసనసభకు రాను అని శపథం చేసిన మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చారు కాబట్టి శాసనసభకు కూడా రావాలని అంబటి రాంబాబు ఆహ్వానించారు.
రాజధాని రైతుల యాత్ర....
తాము ఉన్నది ఉన్నట్లుగానే చెబుతామని అబద్ధాలు చెప్పాల్సిన పని తమ ప్రభుత్వానికి లేదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరానికి శాపంగా మారిందన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించడానికేనని అన్నారు. రియల్ ఎస్టేట్ వారు చేస్తున్న పాదయాత్ర అని అంబటి రాంబాబు అన్నారు. రెండు చేతులా సంపాదించుకోవడానికే ఈ పాదయాత్ర అని ఆయన అన్నారు.
Next Story

