Thu Mar 05 2026 11:01:28 GMT+0530 (India Standard Time)
నేడు పోలీసుల విచారణకు సునీల్ నాయక్
నేడు పోలీసుల విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరు కానున్నారు.

నేడు పోలీసుల విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ-7 నిందితుడుగా సునీల్ నాయక్ ఉన్నారు. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను విచారించనున్నారు. సునీల్ నాయక్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆదేశించారు.
హైకోర్టు ఆదేశాలతో...
అయితే హైకోర్టు మాత్రం విచారణకు హాజరు కావాలని సునీల్ నాయక్ కు సూచించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారిగా ఉన్న సునీల్ నాయక్ తర్వాత బీహార్ వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో విచారణకు సునీల్ నాయక్ హాజరుకానున్నారు. సునీల్నాయక్ను నగరంపాలెం పోలీసులు విచారించనున్నారు.
Next Story

