Fri Dec 05 2025 20:25:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఆ అధికారిని కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించడంతో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కలిసేందుకు వస్తున్నారు

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించడంతో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కలిసేందుకు వస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి అధికారులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులు ఆయనను కలసి అభినందనలను తెలియ చేస్తున్నారు. అధికారులతో పాటు పార్టీ నేతలు కూడా పెద్దయెత్తున తరలి వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
వెనుదిరిగి వెళ్లిన....
అయితే మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. అయితే చంద్రబాబు ఆయనను కలిసేందుకు విముఖత చూపారు. పీఎస్ఆర్ ను కలిసేందుకు చంద్రబాబు నాయుడు ఇష్టపడకపోవడంతో పాటు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఉండవల్లికి వచ్చిన పీఎస్ఆర్ ఆంజనేయులు వెనుదిరిగి వెళ్లారు.
Next Story

