Fri Dec 05 2025 13:35:57 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మళ్లీ విచారణకు
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారణ ముగిసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారణ ఐదు గంటలకు ముగిసింది. ఆరు గంటల పాటు లోకేష్ ను విచారించారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సీఐడీ అధికారులు విచారణ జరిపారు. మధ్యలో గంటపాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు రింగ్ రోడ్డు స్కామ్ పై పలు ప్రశ్నలు వేశారు.
ముప్పయి ప్రశ్నలు...
అయితే విచారణ ఇంకా ముగియలేదని, రేపు కూడా హాజరు కావాలని కోరారు. మొత్తం ఆరుగంటల పాటు ముప్పయి ప్రశ్నలను సీఐడీ అధికారులు లోకేష్ కు వేసినట్లు తెలిసింది. విచారణకు సహకరించకపోవడంతో తిరిగి రేపు మరోసారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరారు. దీనిపై ప్రశ్నిస్తున్న వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారని సీఐడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ మీడియాకు తెలిపారు.
Next Story

