Mon Feb 23 2026 10:09:39 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. నిబంధనలివే
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానున్నాయి

నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రానికి అనుమతిచ్చేది లేదని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ఉన్నత విద్యాశాఖ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఏర్పాటు చేసింది. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
గంట ముందే చేరుకోవాలి...
విద్యార్థులు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, తమకు కేటాయించిన గదికి వెళ్లాలని తెలిపారు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. మార్చి 24వ తేదీ వరకూ జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న విద్యార్థులు వాటిని తీసుకుని పరీక్ష కేంహాజరయ్యే విద్యార్థులు 10,57,312 మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ప్రతి గదిలో సీసీటీవీ నిఘా ఉంటుంది. విద్యార్థుల కోసం ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. సమస్యలుంటే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 425 1531నెంబరుకు ఫోన్ చేయవచ్చు.
Next Story

