Sat Mar 07 2026 19:33:18 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఇందుక సంబంధించిన ఏర్పాట్లను అధికారులు అన్నీ పూర్తి చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు.
వచ్చే నెల 4 వరకూ...
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,84,197 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. రెండో సంవత్సరం పరీక్షలకు 5,19,793 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 4వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి.
Next Story

