Sun Mar 15 2026 07:56:54 GMT+0530 (India Standard Time)
కొట్టుకుపోయిన కారు.. కారులో ఎంతమంది?
వరదల ఉధృతి ఇంకా తగ్గడం లేదు. వర్షాలు కురుస్తుండటంతో వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి

వరదల ఉధృతి ఇంకా తగ్గడం లేదు. వర్షాలు కురుస్తుండటంతో వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురం సమీపంలోని పడమటి కాల్వలో కారు కొట్టుకుపోయింది. కన్నాపురం - బుట్టాయి గూడెం మధ్య లో ఉన్న పడమటి కాల్వలో ఈ ఘటన జరిగింది.
వరద ఉధృతికి...
పడమటి కాల్వ సమీపంలో కారు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి వచ్చింది. ఆ వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో ఎంతమంది ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. కారు కోసం స్థానికులు గాలిస్తున్నారు. పోలీసులు కూడా వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story

