Tue Mar 17 2026 04:36:35 GMT+0530 (India Standard Time)
బెజవాడ చేరుకున్న అదానీ
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విజయవాడకు చేరుకున్నారు. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విజయవాడకు చేరుకున్నారు. ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను అదానీ కలవనున్నారు. వివిధ అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వ్యవహారం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
వివిధ అంశాలపై...
అలాగే రాజకీయ అంశాలను కూడా మాట్లాడే అవకాశముంది. చంద్రబాబు అరెస్ట్ తో పాటు మరికొన్ని అంశాలు కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అదానీని కోరనున్నారు. వీరి ఇద్దరి భేటీ రాజకీయంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

