Mon Mar 16 2026 16:01:30 GMT+0530 (India Standard Time)
ఏపీకి తుపాను హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భద్రాచలానికి 120 కి. మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది. మరో కొన్ని గంటలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ కి, 65 కిలో మీటర్ల దూరంలో, తెలంగాణలోని భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుందని చెప్పింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి.
Next Story

