Fri Dec 05 2025 14:56:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా మారింది : సజ్జల
వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోందన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించడం పార్టీలకు అలవాటుగా మారిందని, ఈవీఎంలతో మోసం చేసి గెలిచారని సజ్జల విమర్శించారరు.
గత ఎన్నికల్లో...
గత ఎన్నికల్లో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో సమాధానం లేదని, జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించిందని అన్నారు. వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. పోలింగ్ బూత్‌ల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండా ఓటింగ్ జరిగిందని, పులివెందుల చరిత్రలో వైసీపీకి ఓటమే లేదని తెలపిారు. జడ్పీటీసీ ఎన్నికల అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందన్న సజ్జల ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందాం అని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, వెల్లంపల్లి , వేమారెడ్డి లు హాజరయ్యారు.
News Summary - independence day celebrations were held grandly at the ysrcp central office. party state coordinator sajjala ramakrishna reddy hoisted the national flag
Next Story

