Fri Dec 05 2025 12:19:32 GMT+0000 (Coordinated Universal Time)
పింఛన్ డబ్బులతో బెట్టింగ్.. వృద్ధులకు పంపిణీ చేయని ఘటన
పెన్షన్ పంపిణీ డబ్బుతో ఉద్యోగి బెట్టింగ్ లకు దిగిన ఘటన సత్య సాయి జిల్లాలో జరిగింది

పెన్షన్ పంపిణీ డబ్బుతో ఉద్యోగి బెట్టింగ్ లకు దిగిన ఘటన సత్య సాయి జిల్లాలో జరిగింది. గుణేమోరుబాగల్ ఉద్యోగి మల్లికార్జున్ పింఛను డబ్బులను బెట్టింగ్ లో పెట్టారు. ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటో తేదీన వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులకు పింఛను మొత్తం అందచేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయఉద్యోగుల చేత ఇంటికి పంపి పింఛన్లు అందిస్తుంది.
బెట్టింగ్ ఆడి...
నేరుగా వారి చేతికి డబ్బులు ఇస్తుండటంతో ప్రతి నెల ఎవరో ఒకరు చేతివాటం చూపుతున్నారు. పింఛను డబ్బులతో పరారవుతున్నారు. కానీ సత్య సాయి జిల్లాలో మల్లికార్జున్ మాత్రం తాను వృద్ధులు, వితంతవులకు ఇవ్వాలని 1.70 లక్షల రూపాయల నగదుతో బెట్టింగ్ ఆడాడు. బెట్టింగ్ లో ఓడిపోవడంతో మల్లికార్జున్ పింఛన్లను పంపిణీ చేయలేదు. దీంతో మల్లికార్జున్ పై పంచాయతి కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

