Thu Mar 19 2026 02:59:33 GMT+0530 (India Standard Time)
పిడుగుపడి ఇద్దరు మృతి
పిడుగుపడి ఇద్దరు రైతులు మరణించిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

పిడుగుపడి ఇద్దరు రైతులు మరణించిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కొత్త మల్లాయపాలెం, పాత మల్లాయపాలెంలో భారీ ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. భారీ శబ్దాలతో పిడుగులు పడటంతో ఇద్దరు మృతి చెందారు.
మిర్చిపంటను కాపాడుకునేందుకు...
కొత్త మల్లాయపాలెం సమీపంలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను కాపాడుకునేందుకు పట్టాలు కప్పుతుండగా శ్యాంబాబు, కృపానందం పిడుగుపాటు పడి మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించినా రైతులు పొలాల్లోకి వెళ్లి మృత్యువాత పడ్డారు.
Next Story

