Fri Dec 05 2025 09:34:31 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాధ్యాయుడికి 12 లక్షల ఖరీదైన కారు బహుమానం
తమకు చదువు చెప్పిన గురువును మరిచిపోకుండా ఆయనకు ఖరీదైన బహుమతిని పూర్వ విద్యార్థులు ఇచ్చిన ఘటన చిలకలూరిపేటలో జరిగింది

తమకు చదువు చెప్పిన గురువును మరిచిపోకుండా ఆయనకు ఖరీదైన బహుమతిని పూర్వ విద్యార్థులు ఇచ్చిన ఘటన చిలకలూరిపేటలో జరిగింది. చిలకలూరిపేట మండలం మద్ది రాల జవహర్ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్ డ్రాయింగ్ మాస్టార్ గా పనిచేశారు. గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించి, 2016 నుంచి మద్దిరాల నవోదయలో పనిచేస్తున్నారు.
పదవీ విరమణ చేయనున్న...
అయితే ఏప్రిల్ 30వ తేదీతో జేమ్స్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణ యించుకున్నారు. ఆదివారం మద్దిరాల నవోదయలో సన్మానోత్సవం ఏర్పాటు చేసి... కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్ దంపతులకు అందజేశారు. దీని విలువ పన్నెండు లక్షల రూపాయలు. శిష్యులు గురువుకు ఇచ్చిన ఖరీదైన కానుక ఇచ్చి సత్కరించడ నిజంగా హర్షించదగ్గ విషయమే.
Next Story

