Sun Mar 15 2026 12:45:44 GMT+0530 (India Standard Time)
బెజవాడలో ఆగని ఫ్లెక్సీల రగడ
విజయవాడలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల గొడవ ఆగడం లేదు. వైసీపీ, జనసేన పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి

విజయవాడలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల గొడవ ఆగడం లేదు. వైసీపీ, జనసేన పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేయడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ ఫ్లెక్సీని తొలగించడమేంటని వారు నిలదీశారు. మరోవైపు కొత్తగా వైసీపీ నేతలు మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వివాదానికి కారణమయింది.
పోలీసులు జోక్యం చేసుకున్నా...
నిన్న విజయవాడలోని కృష్ణలంక రోడ్డులో వైసీపీ సిద్ధం అనే ఫ్లెక్సీ కి పక్కనే జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కల్యాణ్ ఫొటోతో మేమూ సిద్ధం అంటూ మరొక ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండు ఫ్లెక్సీలు పక్క పక్కనే ఉండటంతో వివాదాలకు కారణమవుతుందని భావించి పోలీసులు దానిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిని జనసైనికులు అడ్డుకున్నారు. దీంతో పక్కనే వై నాట్ 175 .. 175లో పోటీ చేయడానికి మీరు సిద్ధమా అని జనసేనాని ప్రశ్నిస్తూ వైసీపీ నేతలు మరొక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు
Next Story

