Sun Mar 15 2026 18:21:30 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ లు చేశారు.

విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న గన్నవరంలో ఘర్షణలు జరగడం టీడీపీ నేతల పై కేసులు బనాయించడంపై టీడీపీ నేతలు ఆందోళన కు దిగే అవకాశముందని భావించి హౌస్ అరెస్ట్ చేశారు.
గన్నవరం ఘర్షణల నేపథ్యంలో...
విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, బొండా ఉమ, బుద్దా వెంకన్న లాంటి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ కు రావాలంటూ నిన్న బుద్దా వెంకన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సవాల్ విసిరారు. అక్కడే తేల్చుకుందాం రమ్మంటూ ఛాలెంజ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story

