Sat Jan 31 2026 09:36:23 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో ఫ్లెక్సీలతో సవాళ్లు - ప్రతిసవాళ్లు
విజయవాడలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పోటా పోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి

విజయవాడలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పోటా పోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ భీమిలీలో నిర్వహించిన సభకు సిద్ధం అని పేరు పెట్టారు. ఇది బాగా పాపులర్ అయింది. జనంలోకి వెళ్లింది. తాము యుద్ధానికి సిద్ధమంటూ జగన్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. భీమిలీ సాక్షిగా ఆయన చేసిన ఛాలెంజ్ ను బెజవాడలో జనసేన నేతలు తీసుకున్నట్లే కనపడుతుంది.
గతంలోనూ...
మీరు సిద్ధమంటే.. మేము కూడా సిద్ధం అని పెద్దయెత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోతో ఉన్న ఈ ఫ్లెక్సీలు మేము కూడా సిద్ధమని ప్రకటించడంతో సవాల్ కు ప్రతి సవాల్ విసిరినట్లేనంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో రెండు పార్టీల మధ్య బెజవాడలో ఫ్లెక్సీల వివాదం మరొకసారి మొదలయినట్లే కనపడుతుంది. గతంలోనూ పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమంటూ వైసీీపీ, దానికి కౌంటర్ గా జనసేన, టీడీపీలు కూడా ఫ్లెక్సీలను వేశాయి.
Next Story

