Thu Mar 19 2026 01:08:26 GMT+0530 (India Standard Time)
నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మూడు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో అతి భారీ వర్షాలు కురవడమే కాకుండా నెల్లూరు - చెన్నై మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరికతో కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ఈ మూడు జిల్లాల్లో...
ప్రకాశం జిల్లా, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు ఏవీ తెరవకూడదని కలెక్టర్లు ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి విద్యాసంస్థలను తెరిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story

