Tue Mar 17 2026 20:15:13 GMT+0530 (India Standard Time)
రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఊరట
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఇండ్ - భారత్ పవర్ జెన్కాం లిమిటెడ్ వ్యవహారంలో ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ దక్కింది. ఇండ్ - భారత్ పవర్ జెన్కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్.బి.ఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేంది.
ఉత్తర్వలును నిలిపివేస్తూ...
ీఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రిజర్వు బ్యాంకు, ఎస్బీఐలకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. ఎస్.బి.ఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను నిలపివేస్తూ నిర్ణయం ప్రకటించింది.
Next Story

