Fri Dec 05 2025 23:48:20 GMT+0000 (Coordinated Universal Time)
వెయ్యి కోట్లు వెంటనే విడుదల చేయాలి
ఆంధ్రప్రదేశ్ కు తక్షణమే వెయ్యి కోట్ల వరద సాయాన్ని ప్రకటించాలని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు తక్షణమే వెయ్యి కోట్ల వరద సాయాన్ని ప్రకటించాలని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. జీరో అవర్ లో ఆయన మాట్లాడారు. ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పెద్దయెత్తు ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని విజయసాయిరెడ్డి సభకు వివరించారు. లక్షా 85 వేల హెక్టార్లలలో పంట నష్టపోయిందని ఆయన ఆవేదన చెందారు.
వరద సాయం....
దీనిపై తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రాధమిక అంచనాల ప్రకారం 6,054 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కేందుకు వెంటనే వెయ్యి కోట్ల రూపాయల సాయం అందించాలని విజయసాయిరెడ్డి కోరారు.
Next Story

