Fri Mar 20 2026 22:24:35 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసులు
ముంబై నటి వేధింపు కేసులో నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది

ముంబై నటి వేధింపు కేసులో నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులు ఆశ్రయించారు. వారి విచారణను గతంలో విచారించిన హైకోర్టు నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.
నేటి నుంచి విచారణ...
అయితే ఆ ఆదేశాల గడువు నేటితో పూర్తికానుండటంతో దీనిపై న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ వేశారు. అన్ని పిటీషన్లను ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగుతుందోనన్న టెన్షన్ పోలీస్ అధికారుల్లో ఉంది.
Next Story

