Sun Mar 15 2026 22:07:01 GMT+0530 (India Standard Time)
Legeslative Council : శాసనమండలిలో గరం.. గరం
శాసనమండలిలో అధికార, విపక్ష నేతల మధ్య వాడివేడిగా చర్చజరుగుతుంది.

శాసనమండలిలో అధికార, విపక్ష నేతల మధ్య వాడివేడిగా చర్చజరుగుతుంది. టీడీపీ సభ్యులు కొందరు గత ప్రభుత్వం ఎన్నిఅప్పులు చేసిందని ప్రశ్నోత్తరాల సమయంలో వేసిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. 9 లక్షల కోట్ల రూపాయలకు పైగానే అప్పులు చేశారని ఆయన తెలిపారు.
వైసీపీ సభ్యుల అభ్యంతరం...
అంతేకాదు వివిధ కార్పొరేషన్ల నుంచి చట్టసభల అనుమతి లేకుండా అప్పులు చేశారంటూ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వాస్తవాలను చెప్పాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. దీంతో శాసనమండలిలో కొంత సేపు గందరగోళం నెలకొంది.
Next Story

