Fri Dec 05 2025 19:56:53 GMT+0000 (Coordinated Universal Time)
తణుకులో ఎస్సై ఆత్మహత్య - తుపాకీతో కాల్చుకొని మృతి
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సస్పెన్షన్ తరువాత ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై ఎ.జి.ఎస్. మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్సై.. ఇటీవల సస్పెన్షన్ కు గురయ్యారు. గేదెల అపహరణ కేసులో మూర్తిపై పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అనంతరం వీఆర్ లో ఉన్న మూర్తి.. శుక్రవారం ఉదయం పెనుగొండలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కొంతసేపు అక్కడే కూర్చొని.. ఆ తర్వాత బాత్ రూమ్ లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
Next Story

