Fri Dec 05 2025 13:16:37 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీకాకుళం జిల్లాలో కాల్పుల కలకలం
శ్రీకాకుళంలో కాల్పుల కలకలం రేగింది. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

శ్రీకాకుళం జిల్లాలో కాల్పుల కలకలం రేగింి. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో వెంకటరమణకు స్పల్ప గాయాలయ్యాయి. మధురానగర్ లోని తన కార్యాలయానికి వెళుతుండగా దుండగులు ఈ కాల్పులు జరిపారు.
మహిళతో పాటు....
తన కార్యాలయం వద్ద ఉన్న సర్పంచ్ వెంకటరమణ వద్దకు ఇక మహిళ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వీరి మధ్య చర్చలు జరుగుతుండగా ఆమె వెంట వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా వెంకటరమణపై కాల్పులు జరిపారు. అయితే తూటాలు వెంకట రమణ పొట్ట భాగాన్ని రాసుకుంటూ వెళ్లడంతో ప్రమాద తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వెంకటరమణను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Tags
- firing
- srikakulam
Next Story

