Wed Mar 18 2026 13:33:19 GMT+0530 (India Standard Time)
ఏలూరు జిల్లాలో కరోనా కలకలం
ఏలూరు జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఇటీవల కాలంలో జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

ఏలూరు జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఇటీవల కాలంలో జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని ప్రాధమిక కేంద్రాల్లో టెస్ట్లు నిర్వహించాలని నిర్ణయించారు.
రెండు రోజుల్లో...
తాజాగా ఏలూరు జిల్లా లో మరో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏలూరులో రెండు, చింతలపూడి లో నాలుగు, నూజివీడు లో మూడు, ఉంగుటూరు లో రెండు, గణపవరం లో ఒక కరోనా కేసు నమోదదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కేవలం రెండు రోజుల్లో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.
Next Story

