Thu Mar 19 2026 02:03:46 GMT+0530 (India Standard Time)
పవన్ తో పొత్తుపై సునీల్ దేవధర్ క్లారిటీ
వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే తాము కలసి వెళతామని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ తెలిపారు

వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే తాము కలసి వెళతామని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ తెలిపారు. జనసేనతో తమ పార్టీ కొనసాగుతుందని ఆయన తెలిపారు. రోడ్డు మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని ఆయన మీడియాకు వివరించారు. ఏపీలో వచ్చే ఎన్నికలలో జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆ రెండు పార్టీలతో....
కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ విషయంలో ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ, టీడీపీలు వారసత్వ రాజకీయ పార్టీలు అని, ప్రజాస్వామ్యం అంటే తెలియని పార్టీలని సునీల్ దేవధర్ అభిప్రాయపడ్డారు. ఆ రెండు పార్టీలతో తమ పోరు కొనసాగుతుందని చెప్పారు.
Next Story

