Fri Dec 05 2025 17:59:27 GMT+0000 (Coordinated Universal Time)
అడ్డుగా ఉందని నేషనల్ హైవే గోడ కూల్చివేత
బద్వేలులో తమ దుకాణాలకు అడ్డంగా గోడ కట్టారంటూ ప్రభుత్వ నిర్మాణాలను వ్యాపారులు కూల్చివేశారు.

బద్వేలులో తమ దుకాణాలకు అడ్డంగా గోడ కట్టారంటూ ప్రభుత్వ నిర్మాణాలను వ్యాపారులు కూల్చివేశారు. జాతీయ రహదారిపై నిర్మించిన గోడ తమ దుకాణాలకు అడ్డుగా ఉందంటూ దానిని తొలిగించారు. కల్వర్టును కూడా పూడ్చి వేయడం ఇప్పుడు వివాదంగా మారింది.
తమ దుకాణాలకు...
జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న చోట కేంద్ర ప్రభుత్వం అడ్డుగోడలను నిర్మిస్తుంది. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ అడ్డుగోడను నిర్మిస్తారు. అయితే వ్యాపారులు తమ దుకాణాలకు గోడ అడ్డువస్తుందని పగలగొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించే అవకాశముంది. అయితే ఇంత వరకూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
- Tags
- badwel
- demolished
Next Story

