Chandrababu : కేబినెట్ విస్తరణకు చంద్రబాబు రెడీ అయ్యారా? నాగబాబుతో పాటు చేరేది వారేనా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. జనవరి ఎనిమిదో తేదీన ఈ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించడమే కాకుండా జనసేన నేత నాగబాబును కేబినెట్ లోకి చేర్చుకోవడం కూడా ఆరోజే జరుగుతుందని చెబుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి గ్యారంటీ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్పష్టం చేశారు. ఐదు నెలల తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి నాగబాబుకు ఇవ్వడం కూడా దాదాపుగా ఖాయమైంది. అయితే నాగబాబు కేబినెట్ లో చేరిక వార్త చంద్రబాబు చెప్పి పక్షం రోజులు దాటుతున్నా ఇంకా ఆయన కేబినెట్ లో చేరలేదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ

