Thu Feb 02 2023 02:31:17 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో కరోనా కల్లోలం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువగా నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువగా నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా 14వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఏపీలో ఎక్కువగా విశాఖపట్నంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఏపీలో అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో విశాఖపట్నం ఒకటి. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
రోజు వారీ కేసులు....
ఈరోజు కొత్తగా విశాఖపట్నంలో 2,258 కరోనా కేసులు నమోదవుతున్నాయి. విశాఖపట్నంలోనే అత్యధికంగా 15,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ విశాఖలో 1,158 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
Next Story