Thu Jan 29 2026 04:11:52 GMT+0000 (Coordinated Universal Time)
11 మంది వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల స్థానికసంస్థల కోటా కింద 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. వీరంతా వైసీపీకి చెందిన వారే. మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్సీల చేత శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, సురేష్ తదితరులు హాజరయ్యారు.
ఎమ్మెల్సీలుగా....
విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత ఉదయభాస్కర్, కృష్ణా జిల్లా నుంచి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్,, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హన్మంతరావు, ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు, చిత్తూరు జిల్లా నుంచి భరత్ లు ప్రమాణస్వీకారం చేశారు.
Next Story

