Mon Feb 02 2026 09:20:56 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పం ఎన్నికల ఫలితం నేడే...?
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ప్రధానంగా కుప్పం మున్సిపాలిటీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ లో నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ప్రధానంగా కుప్పం మున్సిపాలిటీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుప్పం మున్సిపాలిటీతో పాటు మరో 11 మున్సిపాలిటీలకు, నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం 8 గంటల కు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇద్దరికీ....?
కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తుంది. పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నించింది. అందుకే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Next Story

