Thu Mar 26 2026 08:22:10 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి ఏపీలో బీజేపీ పోరుబాట
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈరోజు నుంచి బీజేపీ పోరు యాత్ర సాగించనుంది.

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు స్ట్రీట్ మీటింగ్ లు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి బీజేపీ పోరు యాత్ర సాగించనుంది. వచ్చే నెల 2వ తేదీ వరకూ ఈ స్ట్రీట్ మీటింగ్ లు జరుగుతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సు, రథాన్ని బీజపీ సిద్ధం చేసింది. మొత్తం పదిహేను రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.
ఐదువేల సభలు....
175 నియోజకవర్గాల్లో మొత్తం ఐదువేల సభలను నిర్వహించాలన్నది బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలకు వివరించనుంది. గత, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఈ సభ ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి ఏ పథకాల కింద ఎన్ని నిధులు వస్తున్నాయో కూడా వివరించనున్నారు. ఈరోజు విజయవాడ సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ లో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొననున్నారు.
Next Story

