Thu Jan 16 2025 02:18:26 GMT+0000 (Coordinated Universal Time)
TDP : అనంతలో భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరికి టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు
అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరికి టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను ప్రభాకర్ చౌదరి ఇంటి ముందు దహనం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా జాబితాలో...
తాజాగా టీడీపీ ప్రకటించిన జాబితాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం టికెట్ ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు కేటాయించింది. దీంతో పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరి కార్యాలయం వద్ద పెద్దయెత్తున నిరసనకు దిగారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ టిక్కెట్ కేటాయింపుపై పార్టీ నాయకత్వం పునరాలోచించాలని కోరారు.
Next Story