Thu Jan 29 2026 06:04:09 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్క వజ్రం దొరికితే చాలు.. అన్నీ మారుతాయి
లక్కన్నది ఎప్పుడు, ఎవరిని ఎలా కనికరిస్తుందోనని ఆ ప్రాంత వాసులకు ఓ చిన్న ఆశ.

లక్కన్నది ఎప్పుడు, ఎవరిని ఎలా కనికరిస్తుందోనని ఆ ప్రాంత వాసులకు ఓ చిన్న ఆశ. తొలకరి వర్షం పడిందంటే చాలు పొలాల్లోకి వెళ్ళిపోతారు. మెరుస్తున్న రాళ్లను ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. పెద్దగా చదువుకోకపోయినా రాళ్ళేవో, వజ్రం ఏదో వాళ్లకు బాగా తెలుసు. కుటుంబాలకు కుటుంబాలు పొలాల్లో రోజుల తరబడి గడిపేస్తూ ఉంటాయి.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలోని ఎర్రగుడి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, పగడిరాయి, అమినేబాద్, తుగ్గలి, మదనంతపురం, పెరవలి పంటపొలాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చేసి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఏడాది ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి.
Next Story

