Sun Dec 14 2025 01:57:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు
ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లు బదిలీలు జరిగాయి. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లు బదిలీలు జరిగాయి. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. పాఠశాల కార్యదర్శిగా కోన శ్రీధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సీఆర్టీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ , పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ లు నియమితులయ్యారు.
వారిని జీఏడీకి రిపోర్టు చేయాలని...
వ్వవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదీని నియమించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్ధ జైన్ లను నియమించారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాిన శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్ లను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. మొత్తం పందొమ్మది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.
Next Story

