Fri Dec 05 2025 14:58:29 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కేసులో తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కేసులో తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ప్రకటించడంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.
డిశ్చార్జ్ పిటీషన్ పై...
నేడు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. ఓఎంసీ రివిజన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2022లో శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే దీనిపై సీబీఐ సవాల్ చేయడంతో మరొకసారి విచారించిన తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటీష్ ను కొట్టివేయడంతోఆమె తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.
Next Story

