Mon Mar 16 2026 09:17:02 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు?
ఏపీ లో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు భారీగా జరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ బదిలీలు చేస్తున్నట్లు చెబుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు భారీగా జరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కానుండటంతో ఈ బదిలీలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం కాని రేపు కానీ ఈ బదిలీలు జరిగే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈలోపే అన్ని జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీలు చేయనున్నారు.
రేపు నోటిఫికేషన్....
ఈరోజు అమావాస్య కావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ కూడా రేపు వచ్చే అవకాశముంది. ఏపీలో పదమూడు జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అన్ని జిల్లాలకు ఎస్పీలను, కలెక్టర్లను నియమించనున్నారు. అందుకే భారీగా ఐఏఎస్ , ఐపీఎస్ బదిలీలు జరగనున్నాయి.
Next Story

